సౌదీ విమానాశ్రయాల్లో 35శాతం తగ్గనున్న ఛార్జీలు
- July 21, 2022
రియాద్: బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్ హబ్‌లలో కొన్నింటితో పోటీ పడేందుకు వీలుగా విమానాశ్రయ ఛార్జీలను 35 శాతం తగ్గించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ తగ్గింపు రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, జెడ్డా కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, డమ్మామ్ కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లకు వర్తిస్తుందని పేర్కొంది. ఎయిర్‌పోర్టు ఛార్జీల్లో తగ్గింపు ఈ ఏడాది చివర్లో అమల్లోకి రానుందని వెల్లడించింది. రియాద్‌ను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా మార్చేందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహంలో ఈ చర్య తాజా దశగా నిపుణులు పేర్కొంటున్నారు. విమానాశ్రయ రంగ ప్రైవేటీకరణలో ఎయిర్‌పోర్ట్ ఛార్జీల తగ్గింపు తదుపరి దశ అని సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ఫార్న్‌బరో ఎయిర్ షోలో ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్‌పోస్ట్‌పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







