సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ చెల్లెలు.!
- July 22, 2022
పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’లో పవన్‌కి చెల్లెలిగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? పేరు వాసుకి. చేసింది ఒకే ఒక్క సినిమా కానీ, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిన నటి వాసుకి. నిజంగా ఇంట్లో ఓ చెల్లెలు వుంటే, అది కూడా వాసుకిలాగే వుంటే, ఎంత బావుంటుందో అనుకునేలా ఆ పాత్రలో నేచురాలిటీ చూపించింది వాసుకి.
అందుకే ఆ పాత్ర అంతలా మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే, ఆ తర్వాత ఎందుకో తెలీదు కానీ, వాసుకి మళ్లీ సినిమాల్లో నటించలేదు. చాలా అవకాశాలొచ్చినా నటనపై ఆసక్తి చూపించలేదట. ఆ సినిమా టైమ్‌లోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకుని సెటిలైపోయింది వాసుకి.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వాసుకి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘అన్నీ మంచి శకునములే’ అనే సినిమాతో వాసుకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. డైనమిక్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ప్రియాంక దత్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఈ సినిమా టైటిల్ చూస్తుంటే, చాలా వినసొంపుగా వుంది. అలాగే ట్రెడిషనల్ వైబ్స్ కనిపిస్తున్నాయ్. నందినీ రెడ్డి సినిమాలు యూనిక్‌గా వుంటాయ్. ‘ఓ బేబీ’ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేశారు. అలాగే, ‘అన్నీ మంచి శకునములే’ అంటూ పాజిటివ్ వైబ్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఎలా వుండబోతోందో చూడాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!