68వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా

- July 22, 2022 , by Maagulf
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల జాబితా

ప్రతియేటా దేశవ్యాప్తంగా విడుదల అయిన సినిమాల్లో మేటి చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా.. 2020 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఈసారి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఫిల్మి ఫ్రెండ్లీ స్టేట్స్ గా ఉత్తరాఖండ్, యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.

అయితే ఈ 2020 జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఇక 2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ చలనచిత్ర అవార్డుల జాబితా ఈ విధంగా ఉంది.

బెస్ట్ బుక్ ఆన్ సినిమా ‘ది లాంగెస్ట్ కిస్’
ఉత్తమ కటుంబ విలువల కథాచిత్రం ‘కుంకుం అర్చన్’
స్పెషల్ జ్యూరీ అవార్డు ‘అడ్మిటెడ్’
బెస్ట్ తెలుగు ఫిల్మ్ – ‘కలర్ ఫోటో’
బెస్ట్ కొరియోగ్రఫీ – సంధ్యా రాజు (నాట్యం)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ – రాంబాబు (నాట్యం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – థమన్ (అల వైకుంఠపురములో)
బెస్ట్ యాక్టర్ – సూర్య (సూరారై పోట్రు), అజయ్‌ దేవ్‌గణ్‌(తానాజీ)
బెస్ట్ యాక్ట్రెస్ – అపర్ణ బాలమురళి(సూరారై పోట్రు)
బెస్ట్ మూవీ – సూరారై పోట్రు (సుధా కొంగర)
బెస్ట్ డైరెక్టర్ – సచ్చిదానంన్(అయ్యప్పనుమ్ కొషియమ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – లక్ష్మీ ప్రియ చంద్రమౌళి (శివ రంజనీయం ఇన్నుమ్‌ సిలా పెంగళం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బిజూ మేనన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుం)
ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన సినిమా – తానాజీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com