వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం.. యూఏఈలో శిక్షార్హమైన నేరం

- July 23, 2022 , by Maagulf
వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం.. యూఏఈలో శిక్షార్హమైన నేరం

యూఏఈ: వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం యూఏఈలో శిక్షార్హమైన నేరమని అబుదాబి పోలీసులు తెలిపారు.  "సేఫ్ సమ్మర్" ప్రచారంలో భాగంగా వాహనదారులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.  ముఖ్యంగా ఈ వేసవి వాతావరణంలో పిల్లలను వాహనాల లోపల వదలొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని, చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొంది. అలాంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పిల్లలను వాహనాల్లో వదిలేయడం వల్ల వారు చనిపోవడం లేదా ఊపిరాడకుండా పోయే అవకాశం ఉందని, పిల్లలు కారు కీని ట్యాంపరింగ్ చేసి మూసివేయడం వల్ల ఆక్సిజన్ తగ్గి.. వాహనం లోపల అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని పోలీసులు వివరించారు. కారులోపల చిన్నారులు ఊపిరాడక చనిపోతున్న ఘటనలు, కుటుంబాలు పట్టించుకోకపోవడంతో వారు ఒంటరిగా ఉంటున్నారని, ఆ చిన్నారికి తన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడం వల్లేనని ఈ సందర్భంగా అబుదాబి పోలీసులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com