తెలంగాణలో మంకీపాక్స్ టెన్షన్..
- July 26, 2022
తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న 8మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
మరోవైపు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యేక వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి నుంచి 5 రకాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపారు. త్వరలోనే మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన ఇందిరానగర్ కాలనీ వాసిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా ర్యాషెస్ రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లు.. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







