‘రామారావు’పై మాస్ రాజా ఫోకస్ పెట్టడం లేదా.?
- July 26, 2022
మాస్ రాజా రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరగాల్సి వుంది. కానీ, రవితేజ ఆ పనిపై బొత్తిగా ఫోకస్ పెట్టడం లేదనేది ఆయన ఫ్యాన్స్ నుంచి వస్తున్న అభిప్రాయం.
మొన్నీ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి గమ్మునున్నాడు రవితేజ. అంతే, స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ, సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రిలీజ్ చేయడం కానీ చేయడం లేదు. ఈ సినిమాకి తనని తాను నిర్మాణ భాగస్వామినని కూడా అభివర్ణించుకున్నారు రవితేజ.
అలాంటప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా వుండాలి కదా. స్పెషల్ సాంగ్ చేసిన ముద్దుగుమ్మ అన్వేషి జైన్ మాత్రం తన స్థాయికి మించి ప్రమోషన్లలో పాల్గొంటోంది. యూ ట్యూబ్ ఛానెల్స్ వేదికగా పలు ఇంటర్వ్యూలతో జోరు చూపిస్తోంది.
అలాగే, స్పెషల్ రోల్ చేసిన వేణు తొట్టెంపూడి కూడా తన వంతుగా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. కానీ, మాస్ రాజా జోరెక్కడ.? అలాగే, ఈ సినిమాలోని హీరోయిన్ల పేర్లు కూడా ఎక్కడా వినిపించడం లేదు. పేరుకి ఇద్దరు హీరోయిన్లున్నారు. కానీ ఇద్దరిది అడ్రస్ గల్లంతే.
ఇలాగయితే, మాస్ రాజా ఈ సినిమాతోనైనా సక్సెస్ కొడతాడా.? అసలే ‘ఖిలాడీ’ సినిమాతో విమర్శలు పాలై వున్నాడు రవితేజ. ఆ డ్యామేజ్ పూరించాలంటే, ‘రామారావు’పై కాస్తయినా సీరియస్ ఫోకస్ పెట్టాలి కదా.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







