ప్రయాణీకుల కోసం 'డోర్-టు-డోర్ సర్వీస్: ఎతిహాద్ రైల్వే
- July 27, 2022
యూఏఈ: జాతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రయాణికులు స్టేషన్ నుండి తమ చివరి గమ్యస్థానానికి అత్యంత సౌకర్యంగా చేరుకునేలా “డోర్-టు-డోర్” సర్వీస్ ప్రారంభించినట్లు ఎతిహాద్ రైల్‌కి చెందిన ఒక ఉన్నత అధికారి తెలిపారు. ఎతిహాద్ రైల్‌లోని ప్యాసింజర్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహ్మద్ అల్ ముసావా అల్ హషేమీ మాట్లాడుతూ.. రైల్వేలు అన్ని రకాల రవాణా, భాగస్వామ్య మొబిలిటీ సొల్యూషన్‌లతో అనుసంధానించినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రయాణీకుల చివరి గమ్యస్థానానికి చేరేందుకు ప్రజా రవాణా అందుబాటులో ఉంటుందన్నారు. అల్ రువైస్, అల్ మిర్ఫా, దుబాయ్, షార్జా, అల్ దైద్, అబుదాబితో సహా అల్ సిలా నుండి ఫుజైరా వరకు యూఏఈలోని 11 నగరాలు, ప్రాంతాలను ప్యాసింజర్ రైలు కలుపుతుందని అల్ హషేమీ చెప్పారు. ఒక్కో రైలులో 400 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. గంటకు 200 కి.మీ వేగంతో ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ప్రయాణికులు అబుదాబి నుంచి దుబాయ్‌కి 50 నిమిషాల్లో, రాజధాని నుంచి ఫుజైరాకు 100 నిమిషాల్లో చేరుకోవచ్చు. 2030 నాటికి రైల్ ప్రయాణీకుల సంఖ్య 36.5 మిలియన్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!