కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 14 ఏళ్ల ఖతార్ బాలిక
- July 27, 2022
దోహా: దోహాలోని ఓరిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న అన్వీ అమిత్ జోషి(14).. ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఖతార్ నుండి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. ఆమె 2021లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను కూడా చేరుకొని రికార్డు సృష్టించింది. "శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలామందికి అసాధ్యమైన దీన్నినేను చిరునవ్వుతో.. ఆనందంతో అధిరోహించాను." అని అన్వీ తన ట్రెక్కింగ్ అనుభవాలను తెలిపింది. ఇప్పటి వరకు అన్వీ మూడు దేశాల్లో మొత్తం ఏడు ట్రెక్‌లను పూర్తి చేసింది. భారతదేశంలోని రూపిన్ పాస్, హేమకుండ్ సాహిబ్, కేదార్‌కాంతతో పాటు నేపాల్‌లోని మార్డి హిమాల్, అన్నపూర్ణ సర్క్యూట్/ థొరాంగ్ లా పాస్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లను అధిరోహించింది. తన ఏడో ప్రయత్నంగా మౌంట్ కిలిమంజారోను జయించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!