స్పైస్‌జెట్‌ విమాన సంస్థకు డీజీసీఏ షాక్‌..

- July 27, 2022 , by Maagulf
స్పైస్‌జెట్‌ విమాన సంస్థకు డీజీసీఏ షాక్‌..

న్యూ ఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) షాక్‌ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగా స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. లోపాలపై సమీక్షించేందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు ఈ నెల 6న సైతం స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 19 నుంచి ఎనిమిది స్పైస్‌జెట్‌ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫలితంగా విమానాలను దారి మళ్లించడం, అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.

సాంకేతిక సమస్యలు గుర్తింపు, తనిఖీలు, భద్రత మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎనిమిది వారాల పాటు స్పైస్​జెట్​ కేవలం 50 శాతం విమానాలనే నడిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డీసీజీఏ తీసుకున్న ఈ నిర్ణయం స్పైస్‌జెట్‌ కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com