భారత్ కరోనా అప్డేట్
- July 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా రోజువారీ కేసులు భారీగానే పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3.96 లక్షల మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… 20,557 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 19,216 మంది కరోనా నుంచి కోలుకోగా… 44 మంది మృతి చెందారు. దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటి వరకు మొత్తం 4.39 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా… 5.26 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 5.18 శాతంగా, క్రియాశీల రేటు 0.33 శాతంగా, రికవరీ రేటు 98.47 శాతంగా ఉన్నాయి.
ఇక ఇప్పటి వరకు 87.40 కోట్ల కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. మరోవైపు ఇప్పటి వరకు 203.21 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 42,20,625 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 8.16 కోట్ల మంది ప్రికాషనరీ డోస్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!