'ఉప్పెన' డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా.?

- July 28, 2022 , by Maagulf
\'ఉప్పెన\' డైరెక్టర్ ఏం చేస్తున్నాడో తెలుసా.?

‘ఉప్పెన’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు, బుచ్చిబాబు సన. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడీ టాలెంటెడ్ డైరెక్టర్. తొలి సినిమా అయినా ‘ఉప్పెన’ ఏ రేంజ్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

ఆ స్థాయి హిట్ ఇచ్చినా తదుపరి సినిమా ఇంతవరకూ అనౌన్స్ చేయలేదు బుచ్చిబాబు. అందుకు ఓ పెద్ద కారణమే వుందట. ఎన్టీయార్‌తో తన రెండవ సినిమా డైరెక్ట్ చేయాలన్నదే బుచ్చిబాబు నిర్ణయమట. ఆల్రెడీ ఎన్టీయార్‌కి కథ కూడా నెరేట్ చేశాడట. అయితే, ఈ ప్రాజెక్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదింతవరకూ. ఎన్టీయార్ ఇప్పటికే స్టార్ డైరెక్టర్లతో ప్రాజెక్టులు సెట్ చేసి పెట్టుకున్నాడు. అందులో ఒకటి కొరటాల సినిమా కాగా, ఆ తర్వాత ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ రెండు సినిమాలూ పూర్తియితే కానీ, బుచ్చిబాబు సినిమా పట్టాలెక్కడానికి లేదు. 

అయితే, ఈ లోపు బుచ్చిబాబు తన టాలెంట్‌ని గురువు గారు సుకుమార్ కోసం వినియోగిస్తున్నాడట. సుకుమార్ తెరకెక్కించబోయే ‘పుష్ప 2’కి రైటర్‌గా తన బాధ్యతలు నిర్వహిస్తున్నాడట. ఆల్రెడీ సుకుమార్‌తో కలిసి ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ సినిమాలకు బుచ్చిబాబు పని చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com