అడ్డంగా బుక్కయిపోయిన సుకుమార్ ప్రియ శిష్యడు.!
- July 29, 2022‘గురువుకి నేను సాయం చేసేదేముంది.? ఆయనే నాకు సాయం చేయాలి. నా సినిమా కోసమే ఆయన సాయం చేస్తున్నారు..’ అంటున్నాడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సన. ఈయన డైరెక్షన్‌లో వచ్చిన ‘ఉప్పెన’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమా తర్వాత రెండో సినిమా కోసం చాలా టైమ్ తీసుకుంటున్నాడు బుచ్చిబాబు సన. అందుకు కారణం ఎన్టీయార్‌తో ఆయన తన రెండో సినిమాకి కథ ఫిక్స్ చేసుకోవడం. ఎన్టీయార్ చేయాల్సిన రెండు సినిమాలూ దిక్కూ మొక్కూ లేకుండా పోయాయ్. రెండూ భారీ బడ్జెట్ సినిమాలే. ఈ సినిమాలు పూర్తయితే కానీ, బుచ్చిబాబు సినిమాకి డేట్స్ ఇవ్వలేడు ఎన్టీయార్.
ఇలాంటి పరిస్థితుల్లో నా సినిమాకి గురువుగారు సాయం చేస్తున్నారు.. అంటూ బుచ్చిబాబు సన చెప్పడంలో అర్ధం లేదు. అసలింతకీ బుచ్చిబాబు ఎందుకు ఇలా చెప్పాడంటే, సుకుమార్‌తో బుచ్చిబాబు కలిసి డిస్కషన్స్‌లో వున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఆ ఫోటో చూసి, ‘పుష్ప 2’ కోసం బుచ్చిబాబు సన, సుకుమార్‌కి హెల్ప్ చేస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ, బుచ్చిబాబు ఇదిగో ఇలా కవరింగ్ ఇచ్చుకున్నాడు. కానీ, ఎప్పుడొస్తుందో తెలీని ఎన్టీయార్ సినిమా కోసం ఇప్పటి నుంచే సుక్కు మాస్టర్ సాయం చేసేదేముంది.
ఆయన భుజాలపై ప్రస్తుతం వున్న అతి పెద్ద బాధ్యత ‘పుష్ప 2’నే కదా. శిష్యుడితో ఈ కవరింగ్ ఎందుకు చేయిస్తున్నాడో ఈ లెక్కల మాస్టారు.!
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..