‘విక్రాంత్ రోణ’ అంచనాల్ని అందుకున్నాడా.?

- July 29, 2022 , by Maagulf
‘విక్రాంత్ రోణ’ అంచనాల్ని అందుకున్నాడా.?

కన్నడ సినిమా అంటే ఒకప్పుడు చాలా చిన్న చూపు వుండేది. కానీ, ‘కేజీఎఫ్’ సినిమా తర్వాత కన్నడ సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. శాండిల్ వుడ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. 

‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ పరిశ్రమ నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్యాన్ ఇండియా వైజ్ అంచనాలు పెరిగిపోతున్నాయ్. అలా అంచనాలు నమోదు చేసిందే ‘విక్రాంత్ రోణ’. సుదీప్ హీరోగా రూపొందిన సినిమా ఇది. 

‘బాహుబలి’, ‘ఈగ’, ‘సైరా నరసింహారెడ్డి’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయిన నటుడు సుదీప్. కన్నడలో ఆల్రెడీ ఆయన స్టార్ హీరో. అలాంటి సుదీప్ నుంచి వస్తున్న సినిమా అంటే, తెలుగులోనూ అదే స్థాయి అంచనాలు క్రియేట్ అయ్యాయ్.
ఈ సినిమాని తెలుగులో బాగా ప్రమోట్ చేశారు కూడా. ‘విక్రాంత్ రోణ’ ఎక్కువ భాగం షూటింగ్ హైద్రాబాద్‌లోనే జరగడం విశేషం. అయితే, అంచనాల్ని అందుకోవడంలో ‘విక్రాంత్ రోణ’ సక్సెస్ అయ్యాడా.? అంటే మిశ్రమ స్పందన వస్తోంది.

యాక్షన్ బ్లాక్స్ చాలా బాగున్నాయ్. నిర్మాణ విలువలు నెక్స్‌ట్ రేంజ్‌లో వున్నాయ్. కానీ, రొటీన్ స్టోరీతో ‘విక్రాంత్ రోణ’ని తెరకెక్కించేశారన్న టాక్ వినిపిస్తోంది. సుదీప్ ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్టైలిష్ లుక్స్‌లో కనిపించి మెప్పించాడు. బాలీవుడ్ భామ జాక్వెలీన్ ‘రక్కమ్మా..’ సాంగ్ టోటల్ సినిమాకే హైలైట్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైతే ఇంకా అయిపోలేదు. వీకెండ్‌లో ‘విక్రాంత్ రోణ’ అనుకున్న అంచనాల్ని అందుకుంటుందేమో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com