పవిత్ర కాబాను చేరిన కొత్త కిస్వా

- July 30, 2022 , by Maagulf
పవిత్ర కాబాను చేరిన కొత్త కిస్వా

మక్కా: గ్రాండ్ మస్జీదు, ప్రవక్త మస్జీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ శనివారం తెల్లవారుజామున పవిత్ర కాబాను కొత్త కిస్వాతో అలంకరించింది. పవిత్ర కాబా కిస్వా కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్ నుండి ఎంపిక చేసిన బృందం కాబా కిస్వాను భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చింది. పవిత్ర కాబా కిస్వా బెల్ట్ ముక్కల సంఖ్య 16 కాగా..  అదనంగా ఆరు ముక్కలు, బెల్ట్ దిగువన 12 దీపాలను అమర్చారు. పవిత్ర కాబా కిస్వా కోసం 850 కిలోల ముడి పట్టు, 120 కిలోల బంగారు తీగ, 100 వెండి తీగలను వినియోగించారు. కింగ్ అబ్దుల్ అజీజ్ కాంప్లెక్స్‌లో పవిత్ర కాబా కిస్వా కోసం సుమారు 200 మంది ప్రొఫెషనల్ కుట్టుపని కార్మికులు పనిచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com