జేమ్స్ బాండ్‌గా మారనున్న మెగా పవర్ స్టార్.?
- July 30, 2022
టాలీవుడ్‌లో మెగా పవర్ స్టారగా మెగాస్టార్ లెగసీని నిలబెట్టిన రామ్ చరణ్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌నీ ఘనంగా ఎట్రాక్ట్ చేశాడు. బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో రాముడిగా నిండుగా కొలువుదీరాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కీర్తి ప్రతిష్టలు హాలీవుడ్ దాకా పాకేలా వున్నాయ్.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతోనే రామ్ చరణ్ హాలీవుడ్‌కీ సుపరిచితుడైపోయాడు. కొందరు హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ యాక్టింగ్‌ని కొనియాడుతూ ప్రశంసలు గుప్పించారు. ఇక తాజాగా జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ బెస్ట్ ఛాయిస్ అని మార్వెల్ లూక్ కేజ్ సృష్టికర్త చియో హోదారి కోకర్ చెప్పారు. జేమ్స్ బాండ్ పాత్రకు ఏ హీరో అయితే బాగుంటాడో అభిప్రాయాలు చెప్పాలని ఆయన తాజాగా ట్టిట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
ఈ లిస్టులో కొందరు హాలీవుడ్ ప్రముఖ హీరోలతో పాటూ, రామ్ చరణ్ పేరు కూడా ప్రస్థావించడం విశేషం. అంతేకాదు, రామ్‌చరణ్‌ని ట్యాగ్ చేస్తూ ఎక్కువ పోస్టులు వచ్చాయట. సో, జేమ్స్ బాండ్ పాత్రకు రామ్ చరణ్ బెస్ట్ ఛాయిస్ అని చియో హోదారి ఓ డెసిషన్‌కి వచ్చారట. అంటే, త్వరలోనే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జేమ్స్ బాండ్ అవతారమెత్తబోతున్నారన్న మాట.. అని మెగా ప్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఇటీవలే ‘ఆచార్య’తో ఫెయిల్యూర్ చవి చూసిన రామ్ చరణ్, నెక్స్‌ట్ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్‌తో ఓ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..