తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
- July 31, 2022
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్‌లో షూటింగ్‌లు సోమవారం నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి.
తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా బసిరెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఈసీ మెంబర్స్‌కు ఓటు హక్కు ఉండగా 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 22ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై గెలుపు సాధించారు బసిరెడ్డి.
ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేసింది ఫిలిం ఛాంబర్. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడిన తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన ప్రెసిడెంట్ బసిరెడ్డి..“రేపటి నుంచి సినిమా షూటింగ్ లు బంద్ చెయ్యాలని అనుకున్నాం. సినిమా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారు. 24 క్రాఫ్ట్స్‌లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నాం. అందరం కలసి నిర్ణయం తీసుకున్నాం. అందరం
రేపటి నుంచి ఫెడరేషన్ సమస్యలపై చర్చలు జరుపుతాం. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయించాం. జనరల్ బాడి మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూర్చొని చర్చలు జరుపుతాం. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఇదే నిర్ణయంపై ఉంటాం” అని అన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!