హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
- July 31, 2022
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈనెల 25న ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్, జి.రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.
ముందుగా మూడు రోజుల పర్యటన అనుకున్నారు.కానీ పర్యటన 5 రోజులు సాగింది.ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ పలు పార్టీల రాజకీయ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. కేంద్రంలోని మోడీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నేతలతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







