కరీంనగర్ లో శ్రీవారి ఆలయం: మంత్రి గంగుల

- August 01, 2022 , by Maagulf
కరీంనగర్ లో శ్రీవారి ఆలయం: మంత్రి గంగుల

తిరుమల: తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

తిరుమల శ్రీవారిని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించగా.టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి సహకారంతో కరీంనగర్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణరాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తమ ఆస్తిగా భవిస్తారని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మూడో సారి కూడా ప్రజలు కేసీఆర్ కి పట్టం కట్టబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ వెంట కరీంనగర్ టిఆర్ఎస్ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్ ఉన్నారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com