నందమూరి హీరోకి స్వీట్ వార్నింగ్: రిలీజ్ ముందర టంగ్ స్లిప్ అవ్వొద్దు ప్లీజ్.!
- August 01, 2022
ఈ మధ్య సినిమాల భవిష్యత్తు ఒక్క రోజులోనే తేలిపోతోంది. ఎన్ని భారీ అంచనాలు వేసినా, ఎంత గట్టిగా ప్రమోషన్లు చేసినా ఓపెనింగ్ డేకే భవిష్యత్తు తేల్చేస్తున్నారు ప్రియమైన ఆడియన్స్. రిలీజ్ ముందర చిత్ర యూనిట్ చెప్పిన మాటలకూ, రిలీజ్ తర్వాత సినిమా కంటెంట్‌కీ అస్సలు సంబంధమే వుండట్లేదు.
దాంతో, అసలే ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయ్. ఎలాంటి సినిమా ఎప్పుడు, ఎలా, ఎంతమందికి నచ్చుతుందో అర్ధం కావడం లేదు. ప్రేక్షకుల్ని ధియేటర్లకు రప్పించడం స్టార్ హీరోలకు సైతం కత్తి మీద సాములా తయారైంది. అలాంటి దయనీయమైన పరిస్థితిలో వుంది సినీ పరిశ్రమ. ఇలాంటి నేపథ్యంలో రిలీజ్ ముందర కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తుండాలి చిత్ర యూనిట్.
అలాంటిది నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మంచి సినిమాలు తీస్తే జనాలు ధియేటర్లకు వస్తారు.. అంటూ కళ్యాణ్ రామ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అంటే తన సినిమా చాలా బావుంటుందనే మీనింగా.? ధియేటర్లకు జనం వచ్చేస్తారన్న ధీమానా.? ఈ మధ్య రిలీజైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా పరిస్థితి ఏమైందో అందరికీ తెలిసిందే.
రవితేజ లాంటి మాస్ హీరోకే ఓపెనింగ్స్ కరువైపోయాయ్.రిలీజ్‌కి ముందు డైరెక్టర్ శరత్ మండవ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు, ఈ సినిమా విషయంలో. ఏమైంది.? ఫస్ట్ డే నే తుస్సుమనింది. అలాంటిది కళ్యాణ్ రామ్ తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అభిమానులు.
కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్, కేథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!