వినియోగదారుల పరిరక్షణకు CPA చర్యలు.. RO85,134 రికవరీ
- August 02, 2022
మస్కట్: 2022 మొదటి అర్ధభాగంలో వినియోగదారుల కోసం చర్యలు చేపట్టినట్లు సౌత్ బటినాలోని బార్కాలో ఉన్న కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) తెలిపింది. ఇందులో భాగంగా RO85,134 మొత్తాన్ని తిరిగి రికవరీ చేసినట్లు ప్రకటించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి రికవరీ చేసినట్లు CPA పేర్కొంది. వినియోగదారులకు భరోసా, సంతృప్తినిచ్చే సురక్షితమైన మార్కెట్‌ను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీఏ పిలుపునిచ్చింది. బార్కా కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గరిష్టంగా కార్మిక రంగం నుంచి (RO25,685) రికవరీ కాగా.. అల్యూమినియం, బ్లాక్ స్మిత్స్, వడ్రంగి వర్క్‌షాప్‌లు (RO15,624), కాంట్రాక్టు, బిల్డింగ్ మెటీరియల్స్ సెక్టార్ (RO14,034), ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్లు (RO11,900), ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ఉపకరణాల రంగం (RO10,300) నుంచి రికవరీ చేశారు. అలాగే ఫర్నీచర్, ఫర్నిషింగ్ సెక్టార్ నుండి RO2,233, కళ్యాణ మండపాల నుండి RO1,910, ఆటో విడిభాగాల రంగం నుండి RO1,118, వాహనాల మరమ్మతు వర్క్‌షాప్‌ల నుండి RO1,175, క్లాతింగ్, టెక్స్ టైల్ నుండి RO1,085 రికవరీ చేసినట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!