సౌదీ బురైదాలో ఆకట్టుకుంటున్న డేట్ ఫెస్టివల్

- August 02, 2022 , by Maagulf
సౌదీ బురైదాలో ఆకట్టుకుంటున్న డేట్ ఫెస్టివల్

బురైదా: సౌదీ అరేబియాలోని బురైదాలో ప్రారంభమైన డేట్ ఫెస్టివల్ కట్టుకుంటున్నది. బురైదా డేట్ ఫెస్టివల్‌ను పర్యావరణ, నీరు,వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఖాసిమ్ మున్సిపాలిటీ, కలినరీ ఆర్ట్స్ కమీషన్, నేషనల్ సెంటర్ ఫర్ పామ్స్ అండ్ డేట్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ అల్-రజెహి మాట్లాడుతూ.. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి ఖాసిమ్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ మిషాల్ అద్భుత ఏర్పాటు చేశారని ప్రశంసించారు. ఈ డేట్ ఫెస్టివల్ లో 45 కంటే ఎక్కువ రకాలను ప్రదర్శిస్తారని తెలిపారు. బురైదా డేట్ ఫెస్టివల్ కు అరబ్, గల్ఫ్ దేశాల నుండి వినియోగదారులు, పెట్టుబడిదారులు, ఎగుమతిదారులలు వస్తారన్నారు. దీంతో ఖాసిమ్ డేట్ పరిశ్రమకు ప్రోత్సహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 4,000 మంది యువకులు, మహిళలు తమ చేతితో తయారు చేసిన ఉత్పత్తులను ఈ ఫెస్టివల్ లో భాగంగా అమ్మేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారు. మదీనాలో హజ్, ఉమ్రా యాత్రికుల రాక కారణంగా పండ్లకు, ముఖ్యంగా అజ్వా ఖర్జూరానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. మదీనా వివిధ రకాల ఖర్జూరాలను ఉత్పత్తి చేయడానికి ప్రసిద్ధి చెందింది. వీటిలో అజ్వా, సఫావి, మెజ్‌దూల్, అన్‌బారా, సాగై, బర్నీ, మాబ్రూమ్ ఉన్నాయి.  ఖర్జూరాల టోకు ధర కిలోగ్రాముకు SR12 ($3.20) నుండి SR20 వరకు ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com