ముంబైలోని అంథేరి ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన తాప్సీ..

- April 13, 2016 , by Maagulf
ముంబైలోని అంథేరి ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసిన తాప్సీ..

ఈ మధ్య కొందరు భామలు తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలలో ల్యాండ్‌ కొనేసి అక్కడే ఇల్లు కట్టించుకునే ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఇటీవల రాశిఖన్నా హైదరాబాద్ లో సొంతింటిని ఏర్పాటు చేసుకుంటే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఆ మధ్య వరుస తెలుగు సినిమా ఆఫర్లని సొంతం చేసుకోగా, ప్రస్తుతం మాత్రం ఈ అమ్మడికి టాలీవుడ్‌లో ఆఫర్లు లేవనే చెప్పాలి. బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా మారిన తాప్సీ పింక్, కాశీ చిత్రాల్లో నటిస్తున్నట్టు వెల్లడించింది. అయితే హిందీలో అవకాశాలు ఎక్కువగా వస్తున్నందున , ముంబైలోని అంథేరి ప్రాంతంలో ఓ ఇంటిని కొనుగోలు చేసింది ఢిల్లీ బ్యూటీ . ఈ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలంటే అంత తేలికైన విషయం కాదని, అందుకే ఇన్నాళ్ళు ఈ విషయాన్ని వాయిదా వేసుకుంటా వచ్చానని తెలిపింది తాప్సీ .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com