దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో స్మార్ట్ గేట్లను వాడండి.. ప్రయాణికులను కోరిన యూఏఈ
- August 02, 2022
యూఏఈ: ఈ సంవత్సరం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 6 మిలియన్ల మంది ప్రయాణికులు స్మార్ట్ గేట్ల గుండా వెళ్ళారని.. వేసవి రద్దీ సమయంలో ఆలస్యాన్ని నివారించడానికి ప్రయాణికులు స్మార్ట్ గేట్ల సర్వీస్ ను ఎంచుకోవాలని అధికారులు కోరారు. గేట్ల వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక బయోమెట్రిక్ సిస్టమ్‌లు పాస్‌పోర్ట్ నియంత్రణ అధికారులపై ఒత్తిడిని తగ్గించాయని పేర్కొన్నారు. సగటున విమానాశ్రయంలో ఉన్న 122 స్మార్ట్ గేట్‌లను నెలకు సుమారు ఒక మిలియన్ మంది ప్రయాణికులు ఉపయోగించినట్లు వివరించారు. ఎయిర్‌పోర్ట్‌లో స్మార్ట్ గేట్‌లు, టన్నెల్‌ను ఉపయోగించే వారి సంఖ్య ఈ సంవత్సరం 50 శాతం పెరిగిందని GDRFA-దుబాయ్‌లోని ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ కల్నల్ ఫైసల్ అల్ నుయిమి అన్నారు. పాస్‌పోర్ట్ నియంత్రణ విధానాలను ఐదు సెకన్లలో పూర్తి చేయడానికి ప్రయాణికులను అనుమతించడానికి స్మార్ట్ టెక్నాలజీలో ఫేస్, ఐరిస్-రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిపారు. విమానాశ్రయం నుండి బయలుదేరేటప్పుడు ఎక్కువ మంది ప్రజలు స్మార్ట్ టన్నెల్‌ను ఉపయోగిస్తున్నారని అల్ నుయిమి చెప్పారు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో దాదాపు 23,000 మంది ప్రజలు స్మార్ట్ టన్నెల్‌ను ఉపయోగించారన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..