రామ్, సంతోష్ శ్రీనివాస్ కలిసి మరోసారి..
- April 13, 2016
రా మ్ కథానాయకుడిగా 'కందిరీగ' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆ ఇద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రూపొందుతున్న ఆ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హరీష్ శంకర్.ఎస్, హను రాఘవపూడి కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. 'కందిరీగ' తర్వాత రామ్, సంతోష్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న ఈ సినిమా మే మూడో వారం నుంచి సెట్స్‌పైకి వెళుతుంది. దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళ: అవినాష్.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







