దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో జాక్‌పాట్ కొట్టిన భారతీయుడు
- August 04, 2022
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో కోశి వర్గీస్ (48) అనే భారత ప్రవాసుడు ఏకంగా 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాడు.బుధవారం దుబాయ్ ఇంటర్నెషనల్ విమానాశ్రయంలో నిర్వహించిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ డ్రాలో కోశి విజేతగా నిలిచాడు. కొన్ని వారాల క్రితం అతడు కొనుగోలు చేసిన మిలీనియం మిలియనీర్ సిరీస్ నం.396, లాటరీ టికెట్ నం.0844కు ఈ జాక్‌పాట్ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే కోశి బ్యాంక్ ఖాతాలోకి రూ.7.9కోట్లు వచ్చిపడ్డాయి. దుబాయ్‌లో నివాసముండే 48 ఏళ్ల కోశి చాలా కాలంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ ర్యాఫిల్ లో పాల్గొంటున్నాడు.చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల స్వస్థలం కొచ్చిన్ నుంచి దుబాయ్ వస్తున్న సమయంలో ఇలాగే లాటరీ టికెట్ కొన్నాడు. అదే లాటరీ టికెట్ కోశికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది.
"నేను కొన్ని సంవత్సరాలుగా నా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాను.చివరకు నాకు అదృష్టం వరించింది. ఇంత భారీ మొత్తం గెలిచినందుకు ఆనందంగా ఉంది.ఇది జరిగేలా చేసిన దుబాయ్ డ్యూటీ ఫ్రీ టీమ్‌ని చూడటానికి ఎదురు చూస్తున్నాను" అని కోశి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీ నిర్వాహకులకు అతడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాడు. ఇక 1999లో మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు $1 మిలియన్ గెలుచుకున్న భారతీయ జాతీయులలో వర్గీస్ 195వ వ్యక్తి. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ టిక్కెట్ కొనుగోలుదారులలో అత్యధిక సంఖ్యలో భారతీయులే ఉంటున్నారని ఈ సందర్భంగా ర్యాఫిల్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







