నిరుద్యోగ భృతి కోసం అప్పీల్.. తిరస్కరించిన బహ్రెయిన్ కోర్టు
- August 04, 2022
బహ్రెయిన్: తనను నిరుద్యోగ భృతి పొందుతున్న వారి జాబితా నుండి తొలగించిన కార్మిక మంత్రిత్వ శాఖపై దావా వేసిన బహ్రెయిన్ వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. సరైన కారణాలు లేకుండానే అతని అర్హతలు, అనుభవాలతో సమానంగా ఉన్న నాలుగు ఉద్యోగ ఆఫర్‌లను ప్రతివాది తిరస్కరించినట్లు మంత్రిత్వ శాఖ అందించిన సాక్ష్యాలతో కోర్టు ఏకీభవించింది. దీనిపై ప్రతివాది స్పందిస్తూ..తన ఫైల్ రద్దు చేయబడిందని తెలుసుకుని ఆశ్చర్యపోయానని తెలిపారు. తాను రాజ్యంలో లేనందున జాబ్ ఆఫర్‌లను తిరస్కరించినట్లు కోర్టు విచారణ సమయంలో తెలిపారు. అయితే, కార్మిక మంత్రిత్వ శాఖ సమర్పించిన బలమైన సాక్ష్యాలను కోర్టు సమర్థిస్తూ.. ప్రతివాది దాఖలు చేసిన అప్పీల్ ను తిరస్కరించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







