ఒమన్‌లో రోడ్ల పునరుద్ధరణకు చర్యలు
- August 04, 2022
అల్ రుస్తాక్: వివిధ గవర్నరేట్‌లలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సేవలను పూర్తిగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలను సాగుతున్నాయని నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రాథమిక సేవల విభాగం తెలిపింది. రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, గవర్నరేట్ల మునిసిపాలిటీలు రోడ్ల విభాగం కోసం అత్యవసర ప్రణాళికను రూపొందించినట్లు పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాలలో రోడ్లను తిరిగి ప్రారంభించేందుకు, నిర్వహణకు అవసరమైన పరికరాలు, కార్మికులను తరలించనున్నారు. ప్రతి విలాయత్‌లోని రోడ్ల పరిస్థితులను గుర్తించడానికి వివిధ విలాయత్‌లలో ఫైల్ వర్క్ టీమ్‌ల ఏర్పాటుకు వీరు అదనంగా పనిచేయనున్నారు. భారీ వర్షాల కారణంగా ముసండం, సౌత్-నార్త్ అల్ బతినా, అల్ దహిరా, అల్ బురైమి, అల్ దఖిలియా, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్‌లలో అనేక రోడ్లు దెబ్బతిన్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







