విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం..
- August 04, 2022అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా https://jnanabhumi. ap.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..