బాహుబలి నోట ‘సీతారామం’ మాట: గొప్పగా.!
- August 04, 2022‘సీతారామం’.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
అయితే, చాలా తక్కువ మంది సమక్షంలో అది కూడా కేవలం మీడియా మిత్రుల సమక్షంలోనే ఈ ఈవెంట్ చేయడం విశేషం. అందుకు కారణం లేకపోలేదు. ‘బింబిసార’ ఈవెంట్లో జరిగిన విషాదం కారణంగా ‘సీతారామం’ యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందట.
కాగా, ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రబాస్, సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు. రష్యాలో షూటింగ్ చేసిన ఏకైక తెలుగు సినిమా ఇదేనేమో అని ప్రబాస్ తెలిపారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందట. కాశ్మీర్లో ఎక్కువ భాగం షూటింగ్ జరిపారట.
ఆ సీన్లు చూసేందుకు సగటు ప్రేక్షకుడిగా తాను కూడా చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నానని ప్రబాస్ చెప్పాడు. అలాగే ‘సీతారామం’ మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించాడు ప్రబాస్.
మరోవైపు వైజయంతీ మూవీస్ బ్యానర్లో ప్రస్తుతం ప్రబాస్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్