భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను హెచ్చరించిన సౌదీ అరేబియా

- August 04, 2022 , by Maagulf
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను హెచ్చరించిన సౌదీ అరేబియా

రియాద్: దేశవ్యాప్తంగా అనేక  ప్రాంతాల్లో వర్షం పడే  అవకాశం ఉన్నందున, ఆ  సమయంలో బయటకు వెళ్లేటప్పుడు అత్యంత అప్రమత్తంగా మరియు జాగ్రత్త వహించాలని పౌర రక్షణ డైరెక్టరేట్ ప్రజలను కోరింది.

అసిర్, నజ్రాన్, జజాన్, అల్-బాహా మరియు మక్కా ప్రాంతాలలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, తుఫానులు ఈ సమయంలో కుండపోత ప్రవాహానికి దారితీయవచ్చని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ నివేదికను ఉటంకిస్తూ డైరెక్టరేట్ తెలిపింది. ఈ సమయంలో రియాద్, తూర్పు ప్రావిన్స్, ఖాసిమ్, మదీనా, హేల్, తబుక్, అల్-జౌఫ్ మరియు ఉత్తర సరిహద్దు ప్రాంతంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

పౌర రక్షణ డైరెక్టరేట్ ప్రతినిధి కల్నల్ ముహమ్మద్ అల్ హమ్మదీ మాట్లాడుతూ  ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో  ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వాగులు ప్రవహించే ప్రదేశాలకు, అలాగే వరద మార్గాలు మరియు లోయల నుండి ప్రజలు దూరంగా ఉండాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com