భారత్ కరోనా అప్డేట్
- August 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. దేశంలో తాజాగా 20,551 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 21,595 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364గా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది.
కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.50 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,34,45,624గా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 87.71 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 4,00,110 కరోనా పరీక్షలు చేశారని వివరించింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 205.59 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. వాటిలో రెండో డోసులు 93.46 కోట్లు, బూస్టర్ డోసులు 10.09 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న దేశంలో 36,95,835 డోసుల వ్యాక్సిన్లు వేశారని వివరించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







