అనుష్క మళ్లీ అలాంటి రిస్క్ చేస్తోందా.?
- August 05, 2022జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన అనుష్క, చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంటోంది. అందుకు కారణం ఆమె బరువు బాధ్యతలే. అదేనండీ, పెరిగిపోయిన బరువు కారణమే.
అనుష్క బరువు తగ్గిపోయిందట.. అంటూ ఇదిగో, అదిగో ప్రచారాలే తప్ప అనుష్క బరువు తగ్గిందే లేదు. అయితే, అనుష్క ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి ఎప్పుడో స్టార్ట్ అయ్యింది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా స్టేటస్ ఏంటో తెలియ రాలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అనుష్క లావుగానే కనిపించబోతోందట.
లావుగా.. అంటే, ‘సైజ్ జీరో’ వంటి రిస్క్ చేయబోతోందట.. అనే ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలోనే అనుష్కని అలా చూడలేకపోయాం. అయితే, స్టార్ హీరోయిన్ అయిన అనుష్క అలాంటి రిస్క్ చేయడంతో సినిమా ఫ్లాప్ అయిన అనుష్కని ప్రశంసించకుండా వుండలేకపోయారు.
అయితే, మళ్లీ అలాంటి రిస్కే అంటే, ఇది చాలా ప్రమాదకరమైన ప్రచారం అంటున్నారు. అనుష్క సినిమాలు చేయకపోయినా ఫర్లేదు కానీ, అలాంటి బరువైన పాత్రల్లో కనిపించొద్దు ప్లీజ్.! అని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట స్వీటీకి ఫ్యాన్స్. మరి, ఈ ప్రచారం నిజమేనా.? అనుష్క మళ్లీ అలాంటి రిస్క్ చేస్తుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ