తెలంగాణ కరోనా అప్డేట్
- August 05, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40వేల 663 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 984 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 365 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 57 కేసులు, నల్గొండ జిల్లాలో 41 కేసులు, కరీంనగర్ జిల్లాలో 37 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 923 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 24వేల 708 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 14వేల 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 418గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 43వేల 318 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1061 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..