గాజాపై ఇజ్రాయెల్ దాడులు..8 మంది మృతి
- August 05, 2022
గాజా సిటీ: గాజా పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఎనిమిది మంది మరణించారు.మరో 40 మంది గాయపడ్డారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు.మృతుల్లో ఒక ఐదేళ్ల చిన్నారితోపాటు, ఒక తీవ్రవాది కూడా ఉన్నట్లు సమాచారం.
శుక్రవారం ఈ దాడులు ప్రారంభించినట్లు, గాజా స్ట్రిప్ ప్రాంతంలో ప్రత్యేక ఉద్రిక్త పరిస్థితి ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. గాజాలోని హమాస్‌కు చెందిన ఇస్లామిక్ తీవ్రవాద సంస్థను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. నిర్దేశిత లక్ష్యాలపైకి ఇజ్రాయెల్ రాకెట్ లాంఛర్లు ప్రయోగించింది. గాజాలోని ఒక భవనం లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. భవనం ఏడో అంతస్థుపైన రాకెట్లు దాడి చేశాయి. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. గాజాలో దాదాపు ఇరవై లక్షల మంది నివసిస్తున్నారు. అయితే, ఇక్కడి తీవ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడుతున్నాయి.
దీంతో ఇజ్రాయెల్ తరచూ తీవ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది.సరిహద్దుకు 80 కిలోమీటర్ల దూరంలోనే ఈ దాడులు జరిగాయి.ఇక్కడ ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూసేసినట్లు అధికారులు తెలిపారు.గాజాకు వెళ్లే దారుల్ని ఇటీవలే ఇజ్రాయెల్ మూసేసింది.
తాజా వార్తలు
- లండన్ లో అంగరంగ వైభవంగా శక పురుషుని శత జయంతి వేడుకలు
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉద్యోగాలు...
- ICBF ఆధ్వర్యంలో వైభవంగా ‘లేబర్ డే రంగ్ తరంగ్ 2023’
- ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు..కాపాడిన వైద్యుడు..!
- మస్కట్‌లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- ఈ వేసవిలో ఎయిర్‌పోర్టుల్లో రద్దీ.. నివారణకు 6 మార్గాలు..!
- Dhs1.6b హౌసింగ్ లోన్‌ను ఆమోదించిన షేక్ మహమ్మద్.. 2వేల మందికి లబ్ధి
- హజ్ కోసం 22,000 మంది నియామకం