‘సీతారామం’ ప్రమోషన్లలో రష్మిక కనిపించలేదెందుకంటే.!
- August 06, 2022
నేషనల్ క్రష్ అనే ఇమేజ్ దక్కించుకున్న రష్మికా మండన్నా ఆ క్రేజ్‌ని బాగా యూజ్ చేసుకుంటోంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.
ముఖ్యంగా రష్మిక చేతిలో మూడు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులున్నాయ్. మూడూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. కెరీర్ మొదట్లోనే ఇంత భారీ ప్రాజెక్టులు పట్టేయడం అన్నది అంత ఆషా మాషీ విషయం కాదు.
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనే నానుడికి రష్మిక బాగా వాడేసుకుంటోంది. కొందరు ముద్దుగుమ్మలు సౌత్ సినిమాలతో బిజీగా వున్నప్పుడు, బాలీవుడ్‌పై దృష్టి పెడితే, ఇక్కడ కెరీర్ నాశనమైపోతుంది అని భయపడుతుంటారు. కానీ, రష్మిక అలా కాదు, డేరింగ్ స్టెప్ వేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూనే, బాలీవుడ్లో ఫుల్ ఫోకస్ పెట్టేసింది. రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో ‘గుడ్‌బై’ సినిమాని ఆల్రెడీ పూర్తి చేసేసింది. దీంతో పాటూ, ‘మిషన్ మజ్ను’ సినిమానీ పూర్తి చేసేసింది. సిద్దార్ధ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
వీటితో పాటూ మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు పట్టేసే పనిలో రష్మిక బిజీగా వుందట. ఇలా బాలీవుడ్లో బిజీ షెడ్యూల్స్‌తో వున్న కారణంగానే ‘సీతారామం’ సినిమాని తన స్టయిల్లో ప్రమోట్ చేయలేకపోయానని అంటోంది రష్మిక మండన్నా. ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ సినిమా అయినా కానీ, మంచి విజయం అందుకుంది. రష్మిక పాత్రకు నెక్స్ట్ లెవల్ గుర్తింపు దక్కింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







