ఖతార్ లో ‘బ్యాక్ టు స్కూల్’ క్యాంపెయిన్
- August 07, 2022
దోహా: ఆగస్టు 13న "విత్ ఎడ్యుకేషన్, వీ బిల్డ్ ఖతార్" అనే నినాదంతో "బ్యాక్ టు స్కూల్" ప్రచారాన్ని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ క్యాంపెయిన్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. దోహా ఫెస్టివల్ సిటీ మద్దతు, రవాణా సంస్థ "కర్వా" సహకారంతో.. 2022-2023 విద్యా సంవత్సరానికి అన్ని కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ సాగనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల కోసం విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో "బ్యాక్ టు స్కూల్" క్యాంపెయిన్ ఒకటని పేర్కొంది. విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేందుకు మానసికంగా సిద్ధం చేయడం ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు