నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- August 07, 2022
శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (SHAR) నుంచి ఈరోజు ఎస్‌ఎస్‌ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు.ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది.
చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్–2ఏ(ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్’ను ప్రయోగించారు.
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)లతో ఎన్నో విజయవంతమైన మిషన్లను పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు తొలి ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి అంతరిక్ష రంగంలో సత్తా చాటింది. ఎస్ఎస్ఎల్వీల ద్వారా శాటిలైట్లను భూమి లోయర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. గత కొద్ది వారాలుగా శాస్త్రవేత్తలు స్మాల్ లాంచ్ వెహికల్స్‌ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిన్న శాటిలైట్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఆ దిశగా ఇస్రో అడుగులు వేస్తూ.. ఇవాళ ఎస్ఎస్ఎల్వీ, ఆజాదీ శాట్ లను ప్రయోగించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







