BAPS హిందూ మందిర్ రక్షా బంధన్ ఉత్సవాలు..10 వేల రాఖీలు అందజేత
- August 09, 2022అబుధాబి: రక్షా బంధన్ ను పురస్కరించుకొని అబుధాబిలోని BAPS హిందూ దేవాలయం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా BAPS హిందూ మందిర్ మహిళా విభాగం చేతితో తయారు చేసిన 10,000 కంటే ఎక్కువ రాఖీలను కార్మికులు, ప్రవాసులు, నివాసితులకు అందజేశారు.BAPS హిందూ మందిర్ అధిపతి స్వామి బ్రహ్మవిహారిదాస్ నేతృత్వంలో ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో పలు కంపెనీలకు చెందిన 4,000 మందికిపైగా ప్రవాస కార్మికులు పాల్గొన్నారు. సోదరీమణులతో కలిసి రక్షాబంధన్ జరుపుకోవడానికి తమల్ని ఆహ్వానించినందుకు స్వామికి కార్మికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదో అద్భుత కార్యక్రమని సంతోషం వ్యక్తం చేశారు. 150 మంది మహిళా విభాగం సభ్యురాళ్లు..నెలకు పైగా కష్టపడి రాఖీలను తయారు చేశారు. అనంతరం ఆలయాని వచ్చే భక్తుల డేటాను క్రోడీకరించారు.ప్రతి మహిళా వాలంటీర్ 40 మంది భక్తులను చేరుకుని వ్యక్తిగతంగా రాఖీలు అందజేసినట్లు ఓ సీనియర్ వాలంటీర్ తెలిపారు.ఈ సందర్భంగా, భారతదేశంలో ఉన్న మహంత్ స్వామి మహారాజ్ సామరస్యం, సౌభ్రాతృత్వం కోసం ప్రార్థించిన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం భక్తులు ‘శిల స్థాపన’(పవిత్రమైన ఇటుక వేయడం) కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం స్వామి బ్రహ్మవిహారిదాస్ మాట్లాడుతూ.. రక్షాబంధన్ అనేది ప్రేమ, సమానత్వం, దైవత్వానికి ప్రతీక అన్నారు. ఈ వేల రాఖీలను UAEలోని మహిళా భక్తులు ప్రేమతో చేతితో తయారు చేశారని, ప్రతి కార్మికుడికి వాళ్ల సోదరీమణుల ప్రేమను అందించిందని పేర్కొన్నారు. ఈ థ్రెడ్ పరస్పర గౌరవం, ఐక్యతను సూచిస్తుందని, రాబోయే ఈ అందమైన మందిరం వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లను నిర్మించడంలో సహాయం చేయడానికి అవిశ్రాంతంగా పని చేసే ఈ సోదరులకు సేవ చేస్తున్నందుకు తను నిజంగా గర్వపడుతున్నట్లు BAPS హిందూ మందిర్ చైర్మన్ అశోక్ కొటేచా అన్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం