ఖతార్ లో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి
- August 09, 2022
దోహా: గత వారం రోజుల్లో దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఓ నివేదికను విడుదల చేసింది. గత ఏడు రోజుల్లో కరోనా కారణంగా ఎటువంటి మరణాలు నమోదు కాలేదని తెలిపింది. గత 24 గంటల్లో(ఆగస్టు 8) కమ్యూనిటీ కేసుల సంఖ్య 712 కేసులు (107 ప్రయాణికుల కేసులు) నమోదైనట్లు పేర్కొంది. నివేదిక ప్రకారం.. రోజువారీ సగటు కేసులు 681కాగా.. ప్రయాణికులలో రోజువారీ సగటు రోజువారీ కేసులు 106గా ఉన్నది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,217 ఉండగా.. ఖతార్‌లో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 415,129గా ఉన్నది. ఇందులో 408,231 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు మొత్తం మరణించినవారి సంఖ్య 681గా ఉంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటివరకు 7,339,048 మందికి టీకాలు(1,836,078 బూస్టర్ డోసులు) అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







