మూడు ఆరోగ్య పథకాలను ప్రారంభించనున్న ప్రధాని మోడి
- August 09, 2022
న్యూఢిల్లీ: ప్రధాని మోడి ఆగస్ట్ 15న మూడు ఆరోగ్య పథకాలపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘పీఎం జన్ ఆరోగ్య యోజన’, ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ను ఒకే పథకం కింద కేంద్ర సర్కారు అమలు చేయనుంది. ‘పీఎం సమగ్ర స్వస్త్య యోజన’ పేరుతో దీన్ని తీసుకురానుందని అధికార వర్గాల సమాచారం.
అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరలకు అందించడం ఈ పథకం లక్ష్యమని తెలుస్తోంది. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాతే ఈ పథకం గురించి సమగ్ర వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ‘హీల్ బై ఇండియా’ పేరుతో మరో పథకాన్ని కూడా ప్రధాని ప్రకటించనున్నారు. ఈ పథకం కింద మన దేశ వైద్యులను ఏటా కొంత మందిని విదేశాలకు పంపించి వారికి వివిధ చికిత్సల విధానాలపై శిక్షణ ఇప్పించనున్నారు. ‘హీల్ ఇన్ ఇండియా’ అన్నది మరో పథకం. దీని కింద భారత్ లో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడం కేంద్ర సర్కారు ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!