బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
- August 09, 2022
పాట్నా: బీహార్ లో రాజకీయ సంచలనం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలకు పరాకాష్ఠగా నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేశారు. గవర్నర్ తో భేటీ అనంతరం ఆయన తన రాజీనామా విషయాన్ని నిర్ధారించారు.
రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించినట్టు తెలిపారు. బీజేపీతో సంకీర్ణ భాగస్వామ్యం తెగదెంపులు చేసుకున్నట్టు ప్రకటించిన కాసేపటికే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయ కలకలం రేపింది.
కాగా, ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ తో మాట్లాడేందుకు నితీశ్ కుమార్... మాజీ సీఎం, ఆర్జేడీ శాసనసభాపక్ష నేత రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. జేడీయూ, ఆర్జేడీ కొత్త భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడితే నితీశ్ కుమార్ సీఎంగా రబ్రీదేవి అంగీకరించినట్టు తెలుస్తోంది. తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం అవుతారని బీహార్ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..