సముద్ర మట్టానికి 3,488కిలోమీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకం
- August 13, 2022
న్యూఢిల్లీ: సముద్ర మట్టానికి 3,488కిలోమీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు.స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేసే కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు సముద్రమట్టానికి 3,488 కిలోమీటర్ల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.భారత్-చైనా సరిహద్దుల్లోని లఢక్ నుంచి ఉత్తరాఖండ్ వరకు అన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకాలను ఎగురవేస్తూ ప్రజల్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా రూపొందించిన ‘జై హింద్’ పాటను విడుదల చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించనున్నారు.
దీనికోసం దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను పంపిణీ చేశారు.పోస్టల్ శాఖ ఇప్పటికే కోటీ 20 లక్షలకుపైగా త్రివర్ణ పతాకాలను విక్రయించింది.కాగా, తెలంగాణలో 75వ ఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 22 వరకు జరుగనున్నాయి. ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈనెల 16న ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చేపట్టనుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







