‘మాచర్ల నియోజక వర్గంలో నితిన్ డిపాజిట్లు గల్లంతయ్యేనా.?
- August 13, 2022
యూత్ పుల్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’తో ఓ పెద్ద సాహసమే చేశాడని చెప్పాలేమో. నితిన్‌లోని మాస్ యాంగిల్ చూస్తారా.? అంటూ ప్రచార చిత్రాలు ఊదరగొట్టారు ఈ సినిమాకి. కానీ, రిలీజ్ తర్వాత సినిమాకి డిపాజిట్లే గల్లంతయ్యాయ్. సరైన ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయింది. దాంతో నితిన్ ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అవుతున్నారట. వాస్తవంగా చెప్పాలంటే, ఓ మాస్ సినిమాని లేపడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ, ‘మాస్’ అని చెప్పేందుకే కానీ, అందుకు తగ్గ ఎలిమెంట్స్ ఏమీ ఈ సినిమాలో లేవంటూ ప్రేక్షకులు పెదవి విరిచేస్తున్నారట.నాలుగు ఫైట్లూ, నాలుగు పాటలూ, మరో నాలుగు కామెడీ పంచులు.. వుంటే మాస్ సినిమా అయిపోతుంది.. అనే ఫార్ములాకి చరమగీతం పాడేసి చాలా కాలమే అయ్యింది. ప్రేక్షకుల ఆలోచనలు బాగా మారిపోయాయ్. ఎలా తీసినా మాస్ సినిమా అయిపోతుందంటే కాదు, లెక్కలు మారిపోయాయ్. ఫస్ట్ టైమ్ మాస్ సినిమాలో నటించడం అంటే, ఎంతో జాగ్రత్తలు తీసుకుని వుండాలి నితిన్. కానీ, అలాంటి జాగ్రత్తలేమీ కనిపించలేదీ సినిమాలో. కనీసం మ్యూజిక్ కూడా తుస్ మనిపించేసింది. ‘ఐయామ్ రెడీ..’ సాంగ్ తప్ప, మరే సాంగ్‌కి ధియేటర్లో రెస్పాన్స్ రాలేదు. టోటల్‌గా నితిన్ మాస్ ప్రయోగం విఫలమయ్యిందనే టాక్ బయటికి వచ్చేసింది. అయితే, మౌత్ టాక్ని రివర్స్ చేసి, ముందున్న హాలీడేస్‌ని నితిన్ యూజ్ చేసుకోగలడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







