సింగర్ సునీతలాగే, సురేఖా వాణి కూడా.!
- August 13, 2022అదేంటీ, సింగర్ సునీతకీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణికి ఎందులో పోలికా.? అనుకుంటున్నారా.? సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతోందట. ఇప్పుడు అర్ధమైపోయిందా.? అదేనండీ సింగర్ సునీత లేట్ వయసులో పెళ్లి చేసుకుని, హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
అలాగే, సురేఖా వాణి కూడానా.? పెళ్లి కావల్సిన కూతురుండగా, ఆమె రెండో పెళ్లీ చేసుకోబోతోందా.? అంటే, ఓ యూ ట్యూబ్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని సురేఖా వాణి కూతురు సుప్రీత స్వయంగా చెప్పింది.
కట్ చేస్తే, సరదాగా యాంకర్ అడిగిన ప్రశ్నకు సురేఖా వాణి ముద్దుల తనయ చెప్పిన సమాధానమిది. ‘సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతోందా.? అని యాంకర్ ఆమెను ప్రశ్నించాడు. అందుకు సురేఖా వాణి నవ్వుతూ నో చెప్పేసింది.
కానీ, ఆమె తనయ సుప్రీత మాత్రం చేసేద్దాం.. అని సమాధానమిచ్చింది. అయితే, ఎందుకు తల్లికి మళ్లీ పెళ్లి చేయాలనుకుంటోంది.. అంటే, ‘సింగిల్‌గా వుంటే, నా బుర్ర తినేస్తోంది..’ అంటూ జస్ట్ ఫన్నీగా సమాధానమిచ్చింది. సుప్రీత.అయితే సుప్రీత మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
సురేఖా వాణి, తనయ సుప్రీతతో కలిసి యూ ట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తుంటారు. డాన్స్ వీడియోలూ, కొన్ని ఫన్నీ వీడియోలతో నెటిజన్స్‌ని ఉత్సాహపరుస్తుంటారన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ