నవమికి నైవేద్యానికి మరింత వైవిధ్యం ..

- April 14, 2016 , by Maagulf
నవమికి నైవేద్యానికి మరింత వైవిధ్యం ..

శ్రీరామనవమికి పానకం, వడపప్పే ప్రత్యేకమైనా.. ఇతర పదార్థాలూ చేసుకుంటాం కదా! ఆ నైవేద్యానికి మరింత వైవిధ్యం అందించే వంటకాలివి. తీపి, కారాల కలయికతో ఉన్న ఈ పదార్థాలు సీతారాముల కల్యాణానికి మరిన్ని మధురిమలు అద్దుతాయి.
కావల్సినవి: సగ్గుబియ్యం - కప్పు, ఆలూ పెద్దవి - రెండు (ముక్కల్లా కోయాలి), పల్లీలు - పావుకప్పు, కొత్తిమీర తరుగు - టేబుల్‌స్పూను, జీలకర్ర - అరచెంచా, పచ్చిమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, నిమ్మకాయలు - రెండు, నూనె - వేయించేందుకు సరిపడా. తయారీ: సగ్గుబియ్యాన్ని రెండు లేదా మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత ఆ నీటిని వంపేయాలి. పల్లీలను వేయించి పొడిచేసి పెట్టుకోవాలి. ఆలూని ఉడికించి ముద్దలా చేసుకుని పెట్టుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడల్లా వత్తుకుని కాగుతోన్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేస్తే సరిపోతుంది. వైవిధ్యంగా ఉంటుంది.
కావల్సినవి: అరటిపండ్లు చిన్నవి - ఐదు, గింజల్లేని ఖర్జూరాలు - గుప్పెడు, యాలకుల పొడి - అరచెంచా, యాపిల్‌ ముక్కలు - కప్పు, ద్రాక్ష - గుప్పెడు, బెల్లం తరుగు - కప్పు, తేనె - రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - మూడు చెంచాలు, చక్కెర - టేబుల్‌స్పూను. తయారీ: పండ్లముక్కలూ, ఖర్జూర ముక్కలన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి. వీటిపై బెల్లం తరుగూ, తేనె, నెయ్యి, చక్కెరా వేసి కలపాలి. చివరగా యాలకులపొడి కూడా వేసుకుని బాగా కలిపితే చాలు. పండ్లతో చేసిన పంచామృతం సిద్ధం.
కావల్సినవి: పెసరపప్పు, సెనగపప్పు, మినప్పప్పు, ఎర్ర కందిపప్పు - రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు - తగినంత, కారం - కొద్దిగా, ఆమ్‌చూర్‌పొడి - అరచెంచా, అల్లం - చిన్నముక్క, కొత్తిమీర - రెండు కట్టలు, వాము - అరచెంచా, నూనె - వేయించేందుకు సరిపడా. తయారీ: అన్నిరకాల పప్పుల్ని మూడు గంటల ముందు నానబెట్టుకోవాలి. తరవాత నీళ్లన్నీ వంపేసి మిక్సీజారులోకి తీసుకుని మెత్తని ముద్దలా చేసుకోవాలి. ఇది కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో తీసుకుని వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిని చెంచాతో తీసుకుని కాగుతోన్న నూనెలో వేసుకోవాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. మామూలు గారెకంటే రుచిగా ఉంటుంది.
కావల్సినవి: గింజల్లేని ఖర్జూర ముక్కలు - అరకప్పు, చిక్కని పాలు - అరలీటరు, జీడిపప్పూ, బాదం పలుకులు - పావుకప్పు, యాలకులపొడి - అరచెంచా, నెయ్యి - కొద్దిగా. తయారీ: పాలను ఓ గిన్నెలోకి తీసుకుని బాగా మరిగించాలి. అందులోంచి సగం పాలను విడిగా తీసుకుని దానికి అరకప్పు గోరువెచ్చని నీళ్లు కలపాలి. ఇందులో ఖర్జూర ముక్కలు వేసుకుని ఈ గిన్నెను పొయ్యిమీద పెట్టాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే కాసేపటికి ఖర్జుర ముక్కలు ఉడుకుతాయి. అప్పుడు గరిటెతో మెదిపినట్లు చేస్తే ఖర్జూరాలు ముద్దగా అయి.. పాలు చిక్కగా మారతాయి. ఇందులో మిగిలిన పాలు పోసి.. నేతిలో వేయించిన జీడిపప్పూ, బాదం పలుకులు, యాలకులపొడి వేస్తే చాలు. దీన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. తీసుకుంటే.. రుచిగా ఉంటుంది. నవమినాడు ఆధ్యాత్మిక ఆనందంతోపాటూ ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.
కావల్సినవి: గోధుమపిండి - కప్పు, చక్కెర - ఒకటింబావు కప్పు, నీళ్లు - ఒకటింబావు కప్పు, వెన్న - పావుకప్పు, జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకులు- కొన్ని, నెయ్యి - చెంచా. తయారీ: బాణలిలో కొద్దిగా వెన్న కరిగించి జీడిపప్పూ, కిస్‌మిస్‌ పలుకుల్ని వేయించుకుని విడిగా తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన వెన్న కరిగించి గోధుమపిండిని వేయించుకోవాలి. గోధుమపిండి కాస్త రంగు మారి, కమ్మటి వాసన వచ్చేవరకూ వేయించుకుని తీసుకోవాలి. ఓ గిన్నెలో నీళ్లూ, చక్కెరా తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి బుడగల్లా వస్తున్నప్పుడు వేయించి పెట్టుకున్న గోధుమపిండి వేసేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది దగ్గరగా అయి, గిన్నె అంచుల నుంచి విడిపోతున్నప్పుడు నెయ్యి వేసి దింపేయాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌ పలుకులు వేసి తినాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com