తెలంగాణ కరోనా అప్డేట్
- August 13, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.మరో రోజు 500ల లోపే కేసులు వచ్చాయి.అదే సమయంలో కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 28వేల 899 మందికి కరోనా పరీక్షలు చేయగా, 440 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.హైదరాబాద్ లో అత్యధికంగా 195 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 28 కేసులు, నల్గొండ జిల్లాలో 18 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 652 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 28వేల 911 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 21వేల 249 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3వేల 551కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 30వేల 205 మందికి కరోనా పరీక్షలు చేయగా, 476 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







