క్రైమ్‌రేట్‌ తగ్గించడానికి దుబాయ్‌ పోలీస్‌ న్యూ యాప్‌

- April 14, 2016 , by Maagulf
క్రైమ్‌రేట్‌ తగ్గించడానికి దుబాయ్‌ పోలీస్‌ న్యూ యాప్‌

దుబాయ్‌ రెసిడెంట్స్‌ కోసం పోలీసులు కొత్త యాప్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నిఫ్టీ దుబాయ్‌ పోలీస్‌ యాప్‌ ద్వారా దుబాయ్‌ వాసులెవరైనా సరే తమ పరిసరాల్లో జరిగే క్రైమ్‌ గురించి పోలీసులకు రిపోర్ట్‌ చేయవచ్చు. 'పోలీస్‌ ఐ' సెక్షన్‌ని ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దుబాయ్‌ వాసులు కొత్త యాప్‌ని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుందనీ, దాంతోపాటుగా పోలీస్‌ ఐ సెక్షన్‌ని కూడా అప్‌డేట్‌ చేసుకోవాలని కోరారు. డిస్ట్రబెన్స్‌, ఆల్కహాల్‌ / డ్రగ్స్‌, అనుమానాస్పద వాహనాలు, అనుమానాస్పద విక్రయాలు, గ్యాంబ్లిఇంగ్‌, వాండలిజమ్‌, ప్రాస్టిట్యూషన్‌, బెగ్గింగ్‌ తదితర నేరాలకు సంబంధించి ఈ యాప్‌ ద్వారా పోలీసులు సమాచారం ఇవ్వవచ్చు. రోడ్లపై వెళుతున్న సమయంలో జరిగే యాక్సిడెంట్స్‌పైన కూడా ఈ యాప్‌ మీకు ఉపయోగపడుతుంది. పోలీస్‌ స్టేషన్లకు సంబంధించిన సమాచారం ఇందులో మరో ప్రత్యేకత. పోలీస్‌ స్టేషన్లు, హాస్పిటల్స్‌, ఫార్మసీలకు సంబంధించిన లొకేషన్లు మ్యాప్‌ ద్వారా యాప్‌ వినియోగదారులకు అందుతాయి. విజువల్లీ ఇంపెయిర్డ్‌ కోసం కూడా ఇందులో కొన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. అరబిక్‌, ఇంగ్లీష్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌ మరియు రష్యన్‌ లాంగ్వేజెస్‌లో యాప్‌ అందుబాటులో ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com