దిల్ రాజు ఫ్రస్టేషన్: సోషల్ మీడియాతో ఆటలా.?
- August 17, 2022
‘కార్తికేయ 2’ సినిమాపై టాలీవుడ్లో కొందరు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేశారనీ, కావాలనే సినిమాని తొక్కేశారనే ప్రచారం జరిగింది. అందులో కీలకమైన భాగస్వామ్యం నిర్మాత దిల్ రాజుదే అనే ప్రచారం కూడా వుంది.
వాయిదాల పర్వంతో సతమతమైన ‘కార్తికేయ 2’, ఎట్టకేలకు రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అయితే, రిలీజ్ తర్వాత కూడా ఈ సినిమాని వాయిదా వేసినందుకు రచ్చ ఆగలేదు.
నెట్టింట ట్రోలింగ్ జురగుతూనే వుంది. దాంతో, దిల్ రాజు బయటికి వచ్చారు. తన తప్పేం లేదంటూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన సోషల్ మీడియాపై దారుణంగా చురకలంటించారు.
వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తే కుదరదనీ, హెచ్చరించారు. అంతేకాడు, వాస్తవాలు తెలిస్తే రాయండి. లేదంటే మూస్కోండి.. అంటూ సోషల్ మీడియాపై స్ర్టాంగ్ కౌంటర్స్ వేశారు.
నిఖిల్ తనకు ఆప్తుడనీ, పీపుల్స్ మీడియా సంస్థతో తనకెంతో మంచి అనుబంధం వుందనీ, అయినా, అది టాలీవుడ్లో బెస్ట్ పొజిషన్లో వున్న నిర్మాణ సంస్థ అనీ, దాన్నిఆపే దమ్ము ఎవరికి వుందంటూ, రాసే ముందు కాస్తయినా కామన్సెన్స్ యూజ్ చేయాలనీ ఫైర్ అయ్యారు దిల్ రాజు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







