‘లైగర్’ కోసం రౌడీ అంత తీసుకున్నాడా.?
- August 17, 2022
రౌడీ స్టార్ అని ఫ్యాన్స్‌తో ముద్దుగా పిలిపించుకునే హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆగస్టు 25న ఈ సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది.
ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో చిత్ర యూనిట్ చాలా బిజీగా గడుపుతోంది. ఫస్ట్ టైమ్ విజయ్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో, క్షణం తీరిక లేకుండా, ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా విజయ్ దేశమంతటా తిరుగుతున్నాడు.
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి ఛార్మి, పూరీ జగన్నాధ్ ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా రూపొందించారు. విజయ్‌కి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఇచ్చారట. అంతకు ముందెన్నడూ విజయ్ తీసుకోలేని భారీ మొత్తమనీ ప్రచారం జరుగుతోంది. అక్షరాలా 35 కోట్లు అనీ సమాచారం.
అలాగే, ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన రియల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌కి ఈ మొత్తం ఇంకా ఎక్కువనీ చెబుతున్నారు. అది అక్షరాలా 40 కోట్లు అనీ తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల రెమ్యునరేషన్లు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయ్.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







