పాయల్ రాజ్‌పుత్ పబ్లిసిటీ కోసమే అలా మాట్లాడిందా.?

- August 18, 2022 , by Maagulf
పాయల్ రాజ్‌పుత్ పబ్లిసిటీ కోసమే అలా మాట్లాడిందా.?

పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్‌కి పరిచయం అక్కర్లేదు. ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో కుర్రకారులో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఈ అందాల భామ. అయితే, అలా దక్కించుకున్న పేరుతో అమ్మడు స్టార్ ‌డమ్ సంపాదించుకోలేకపోయిందనుకోండి.
అయితే, పాయల్ రాజ్‌పుత్ మంచి టాలెంటెడ్. కేవలం అందాల ఆరబోతే కాదు, ఛాలెంజింగ్ పాత్రల్లోనూ మెప్పించగల టాలెంట్ ఆమె సొంతం. అయితే, టాలెంట్ వుంటే సరిపోదుగా. అదృష్టం కూడా వుండాలి. ఆ అదృష్టం పాయల్ రాజ్‌పుత్‌ని వరించేందుకు కాస్త ఆలోచిస్తున్నట్లుంది.
మూడేళ్ల క్రితం స్టార్ట్ అయిన ‘తీస్ మార్ ఖాన్’ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి నోచుకుంది. రేపు అనగా ఆగస్టు 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆది సాయి కుమార్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్ల ద్వారా ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి తెలిసింది.
వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ, ఆదికి కూడా ఓ మంచి హిట్ పడనే లేదింతవరకూ. అలాగే పాయల్ రాజ్‌పుత్ కూడా. వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్నా స్టార్‌డమ్ దక్కించుకోలేకపోయింది. చూడాలి మరి, ‘తీస్‌మార్ ఖాన్’ సినిమా ఈ ఇద్దరికీ బ్రేక్ ఈవెన్ అవుతుందేమో.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com